కోహ్లీ ని కలిసి సలహాలు ఇచ్చిన గంగూలీ

ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ జట్టు వరసగా ప్రతీ మ్యాచ్ లో ఫెయిల్ ఆవుతూ వస్తోంది. ఈ మ్యాచ్ చాలా ఈజీ ఇది గెలిచి తీరాలి తక్కువ స్కోర్ టార్గెట్ చెయ్యడమే కదా అనుకున్న మ్యాచ్ లలో కూడా అడ్డంగా ఓడిపోతూ ఛాలెంజర్ జట్టు సుపర్ గా ఓడిపోతోంది. ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ లో ఆడిన ఆర్సీబీ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచింది. ఈ టీం కెప్టెన్ కోహ్లీ కూడా ఈ విషయం లో బాగా డల్ గా కనిపిస్తున్నాడు. గేల్, తాను, డివిల్లర్స్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్ లు ఉన్న టైం లో కూడా జట్టు అడ్డంగా ఓడిపోతూ ఉండడం అందరినీ కలకలం లో తోసేస్తోంది.

వీరికి టీం ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ అండగా నిలిచాడు . గెలుపుకోసం చాలా కష్టపడాలి అనీ ఈ టీం లో దృక్పదం లోపిస్తోంది అని గంగూలీ కోహ్లీ ని కలిసి చెప్పినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ వాట్సన్ ని పక్కకి పెట్టి గేల్ తోనే మ్యాచ్ లు ఆడించాలి అనే పెద్ద సలాహా ఇచ్చాడు గంగూలీ. అతడిని రిజర్వ్ బెంచ్ లో కూర్చో పెట్టడమే ఆర్సీబీ కి పెద్ద నెగెటివ్ పాయింట్ అన్నాడు గంగూలీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here