సెమీస్ కి న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా కి గండం , ఛాంపియన్స్ ట్రోఫీ

ఛాంపియన్స్ ట్రోఫీ సీరీస్ వర్షం వల్ల అర్ధాంతరంగా ఆగుతూ నడుస్తూ ఆగుతూ నడుస్తూ అన్నట్టు ఉంది వ్యవహారం. మొట్టమొదటి సారిగా సెమీస్ కి అర్హత సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. ఫేవరేట్ గాఉన్న న్యూజిలాండ్ మీద సూపర్ విక్టరీ తో ఇంగ్లాండ్ ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్ జట్టులో రూట్ (65 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు), బట్లర్ (48 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు), హేల్స్ (62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు), స్టోక్స్ (53 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు) రాణించడంతో 49.3ఓవర్లలో 310 పరుగులు చేయగలిగింది.

తరవాత బ్యాటింగ్ కి వచ్చిన న్యూజిలాండ్ మొదట్లో పరవాలేదు అన్నట్టు ఆడినా కూడా నెమ్మది నెమ్మదిగా వికెట్లు కోల్పోయి రెండొందలు దాటిన తరవాత ఆల్ అవుట్ ఐపోయింది. మినిమం పోరు కూడా చూపించని న్యూజిలాండ్ ఫేవరేట్ అనిపించుకోలేక పోయింది. ఇంగ్లాండ్ సెమీస్ కి వెళ్ళడం తో ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కి గండం పడేలా ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here