జనసేనతో కలవడం కోసం జగన్ ప్రయత్నాలు .. పవన్ దగ్గరకి కాపునేతలని పంపిన వైకపా ?

ఒంటరిగా రానున్న ఎన్నికలకి వెళితే తనకి నష్టమే అని భావిస్తున్నట్టు ఉన్నారు వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి. జన సేన పార్టీ తో పొత్తు పెట్టుకుని మాత్రమె ముందుకి వెళ్ళాలి అనేది జగన్  ఆలోచన గా తెలుస్తోంది . ప్రస్తుతం ఈ పని మీదనే పవన్ తో మాట్లాడడం కోసం స్పెషల్ చర్చలు జరిపే ఆలోచనలో ఉన్నారు వైకపా వారు. వైకపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఒంటరి పోరు డేంజర్ అని జగన్ అర్ధం చేసుకున్నారు. పవన్ ని తమవైపు తిప్పుకుంటే కలిసి వస్తుంది అనీ టీడీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి అనేది జగన్ మొదటి అడుగు గా చెబుతున్నారు.

ఇక పవన్ కు ఉన్న అభిమానుల దృష్ట్యా, ఆయనతో కలసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని వామపక్ష పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో పవన్ తో జత కడితే, సీపీఐ, సీపీఎంలు కూడా కలసి వచ్చినట్టేనని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ లెక్కలో పవన్ దగ్గరకి కాపు నేతలని పంపి రాయబారం నడుపుతున్నారు జగన్ త్వరలో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here