తన గురించి కంటే అఖిల్ గురించే ఎక్కువ కంగారు పడుతున్న నాగార్జున :

తెలుగు సినిమా చరిత్ర లో ఏ హీరో చేయ్యనట్టుగా ఫామిలీ మొత్తాన్నీ మనం సినిమాలో చూపించారు హీరో నాగార్జున. తండ్రి నాగేశ్వర రావు కొడుకు నాగ చైతన్య లని ప్రధాన పాత్రల్లో పెట్టి ఆఖర్లో అఖిల్ అక్కినేని ఎంట్రీ తో ఇరగదీసాడు నాగ్. ఫ్యామిలీ కి అంత ప్రాధాన్యత ఇచ్చే నాగార్జున అక్కడక్కడా ప్లాప్ లు చవి చూస్తున్నారు. ప్రస్తుతం రాజు గారి గది 2 ని షూట్ చేస్తున్న నాగార్జున కొడుకు ల సినిమాలు సంగతి కూడా ఎక్కువగా పట్టించుకుంటున్నారు.

ప్రస్తుతం తన కెరీర్ కంటే కొడుకులు ఇద్దరి కెరీర్ నీ సరి చెయ్యాలని ఫీల్ అవుతున్న నాగార్జున కథలు, డైరెక్టర్ లూ చివరికి హీరోయిన్ ల విషయం లో కూడా తన స్టైల్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫోకస్ అఖిల్ మూవీ మీద పడబోతున్నట్లు సమాచారం.ఈ చిత్రాన్ని నాగ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఏకంగా రూ.40 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడట నాగ్. అఖిల్ రీలాంచ్ అద్భుతంగా ఉండాలి అనేది నాగార్జున ప్లాన్ గా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here