రాముడు కంటే రావ‌ణుడు చాలా మంచి వాడు : మంత్రి సుధాకరణ్

రాముడి కన్నా రావణుడే గొప్ప వ్యక్తి అని ఓ మంత్రి కితాబు ఇచ్చారు. అన్న రాముడు ఉంటే త‌మ్ముడు భ‌ర‌తుడుకు రాజ్యం ద‌క్క‌ద‌ని భావించిన పిన‌త‌ల్లి కైకేయి రాముణ్ని14 ఏళ్ల పాటు వ‌న‌వాసం చేయాల‌ని కోరుతుంది. దీంతో త‌ల్లి మాట‌ను జ‌వ‌దాట‌ని రాముడు అర‌ణ్య‌వాసం చేస్తాడు. రాముడుతో పాటు సీతా దేవి అర‌ణ్య‌వాసం చేస్తుంది. అయితే అర‌ణ్య‌వాసంలో  రాముల వారు  ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా..ఇంట్లో ఉన్న సీత‌మ్మ‌ను పెళ్లి చేసుకునేందుకు రావ‌ణుడు స‌న్యాసి వేషంలో వ‌చ్చి సీత‌మ్మ‌వారిని అప‌హ‌రిచుకొని  ఆమెను పుష్పక విమానంలో తీసుకెళ్ళి అశోక వనంలో ఉంచాడు.

ఈ అప‌హ‌ర‌ణ గురించి ప్ర‌స్తావించిన కేరళ మంత్రి సుధాకరణ్ చెప్పుడు మాట‌లు విన్న రాముడుకంటే.. అశోక వ‌నంలో ఉంచి సీత‌మ్మ‌ను కంటికిరెప్ప‌లా కాపాడిన రావ‌ణుడే చాలా మంచివాడ‌ని అన్నాడు. అంతేకాదు సీత జోలికి పోకుండా చూసుకున్న రావ‌ణుడు చాలా మంచివాడ‌ని పున‌రుద్ఘాటించాడు. మ‌రోవైపు కొద్దిరోజుల క్రితం అత్యాచారానికి య‌త్నించిన  స‌న్యాసి జ‌ననాంగాలు కోసిన యువ‌తికి అవార్డు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. అయితే ఈ వ్యాఖ్య‌లే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కొంత‌మంది నెటిజ‌న్లు సుధాక‌ర‌ణ్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించ‌గా మ‌రికొంత‌మంది భిన్నాభిప్రాయం వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here