అన్నం పెట్టట్లేదు అని కాలేజీ ని ఏం చేసారో చూడండి .. వీరంతా ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు

హైదరాబాద్ నిజాం పేట లోని నారాయణ కాలేజీ హాస్టల్ లో ఉండే సెకండ్ ఇయర్ ఇంటర్ స్టూడెంట్స్ రచ్చ రచ్చ చేసారు. కాలేజీ భవనం లో దొరికినవి అన్నీ పగల గొట్టి వీరంగం సృష్టించారు వీరు. తమ కోపానికి కారణం ఏంటో మీడియా ముందరే ఓపెన్ అయ్యారు వాళ్ళు. అన్నం చాలినంత పెట్టడం లేదు అనీ ఇంకాస్త పెట్టమని అడిగినా కూడా పెట్టట్లేదు అని వాళ్ళు చెబుతున్నారు. అన్నం కూరలు రుచిగా ఉండకపోగా పురుగులు కూడా వస్తున్నాయి అని వారు ఆరోపిస్తున్నారు.
రెండు నెలల సెలవుల తరువాత తాము వస్తే, హోం సింక్ హాలిడేస్ ఇవ్వలేదని, కేవలం జూనియర్లకు మాత్రమే సెలవులిస్తామని యాజమాన్యం తేల్చి చెప్పిందని అన్నారు. తల్లి తండ్రులు వచ్చిన టైం లో మినిమం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు అనీ తమ ముందరే పేరెంట్స్ మీద ఫీజుల కోసం కేకలు వేస్తూ అరుస్తున్నారు అనీ ఎక్కడికి వెళ్ళాలి అన్నా స్వతంత్రం లేకుండా పోయింది అనీ కనీసం గంట సేపు బయటకి వెల్ల హక్కు లేదు అని వాపోతున్నారు పిల్లలు.  మొత్తం 400 మంది ఉన్న హాస్టల్ లో బాత్ రూములు సరిగ్గా లేవని, చాలినన్ని నీళ్లు రావని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here