అమెరికా తరఫున వరల్డ్ టీ 20 లో ఇండియన్ లేడీ ప్లేయర్ ..

తెలంగాణా తెలుగు అమ్మాయి సాల్లూటి సింధుజ అమెరికా లో తెలుగు సత్తా చాటింది. యూఎస్ క్రికెట్ జట్టు కి ఆమె ఎంపిక అయ్యింది. ఆగస్ నెలలో స్కాట్ లాండ్ లో జరగబోతున్న వరల్డ్ టీ ట్వెంటీ క్వాలిఫైర్ లో ఆమె అమెరికా తరఫున ఆడబోతోంది. ఆమె స్వస్థలం ఆమనగల్లు అని చెబుతున్నారు. 14 సంవత్సరాల నుంచీ ఆమె హైదరబాద్ జట్టు కి ఆడుతోంది. బ్యాట్స్ వుమెన్ గా వికెట్ కీపర్ గా ప్రతిభ కనబరిచే ఆమె అదే టైం లో బీటెక్ తో పాటు ఎంబీయే పూర్తి చేసింది. సిద్దార్థ రెడ్డి అనే అతన్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిన ఆమె యూఎస్ వెళ్ళిన తరవాత క్రికెట్ ని కెరీర్ గా మార్చుకుని పూర్తి దృష్టి సారించింది.

భర్త సహకారం పూర్తిగా అందడం తో స్థానిక క్లబ్స్ కి క్రికెట్ ఆడడం మొదలు పెట్టింది. ఆమె ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు ఆమెను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అమెరికా నేషనల్ టీమ్ కు ఎంపికైన సింధుజపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here