మై డియర్ రాజా… నా సంతోషం నువ్వే !

తన చలాకి మాటలతో బుల్లి తెర సేన్సేషన్ గా పేరు తెచ్చుకుంది యాంకర్ సుమ కనకాల. సినిమా సెలెబ్రిటీలకు సమానమైన క్రేజ్ సుమ సొంతం. ఇక స్క్రీన్ పై ఎంతో చలకిగా ఉండే సుమ రియల్ లైఫ్ లో గత కొన్ని రోజులుగా కష్టాల్లో ఉందని… భర్త రాజీవ్ కనకాలతో విడాకులు తీసుకుందని వార్తలు వచ్చాయి.

అయితే అవన్నీ తప్పుడు కథనాలు అని ఈ మధ్య ఏ గొడవ జరగలేదని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం ద్వారా నిర్దారించింది. ఇదిలా ఉంటే తాజాగా సుమ ట్విట్టర్ లో చేసిన ఓ పోస్ట్ తో అన్ని రకాల రూమర్లకు చెక్ పెట్టింది. భర్త చేతిని ప్రేమతో పట్టుకొని దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ… ‘మై డియర్ రాజా… ఎప్పటికీ నా సంతోషం నీవే అంటూ’ ట్వీట్ చేస్తూ.. తన భర్త చేతిని పట్టుకుని, ఆయన భుజంపై తల వాల్చిన ఫొటోను షేర్ చేసింది. ఈ ఒక్క ట్వీట్ తో అన్ని పుకార్లకు చెక్ పెట్టింది సుమ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here