ఏపీకి గుడ్ న్యూస్‌.. విశాఖ‌లో ప్ర‌ఖ్యాత కంపెనీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయి. తాజాగా విశాఖ‌లో త‌మ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు యెకహోమా ఆఫ్ హైవే టైర్ల ఉత్ప‌త్తిలో దూసుకుపోతోంది. దేశంలో ఈ కంపెనీ టైర్ల‌కు మంచి గిరాకీ ఉంది. అందుకే త‌మ వ్యాపారాన్ని విస్త‌రించుకోవాల‌ని చూస్తోంది.

విశాఖ‌లో ఏటీజీ త‌మ యూనిట్‌ను ప్రారంభించాల‌ని అనుకుంది. జ‌పాన్‌కి చెందిన ఈ కంపెనీకి ఇప్ప‌టికే ఇండియాలో రెండు త‌యారీ యూనిట్లు ఉన్నాయి. గుజ‌రాత్‌, త‌మిళ‌నాడులో రెండు యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు విశాఖ‌లో రూ. 1240 కోట్ల‌తో యూనిట్‌ను ప్రారంభించాన‌లి యోచిస్తోంది. 2023 సంవ‌త్స‌రం కంతా ఇక్క‌డ ఉత్ప‌త్తిని ప్రారంభించాల‌ని అనుకుంటున్న‌ట్లు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

విశాఖ‌లో ఈ యూనిట్ ప్రారంభం కావ‌డం వ‌ల్ల 600 మందికి ఉపాధి ల‌భిస్తుందని యెక‌హోమా ఇండియా యాజ‌మాన్యం తెలిపింది. క‌రోనాకి ముందే విశాఖ‌ను ఎంపిక చేశామ‌ని అయితే లాక్‌డౌన్ కార‌ణంతో సంస్థ నిర్మాణ ప‌నులు ప్రారంభం చేయ‌లేద‌ని పేర్కొంది. త్వ‌ర‌లోనే యూనిట్‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపింది. ప్ర‌ముఖంగా వ్య‌వ‌సాయ రంగానికి అవ‌స‌ర‌మైన టైర్లు, హైవే వాహ‌నాల‌కు అవ‌స‌ర‌మైన టైర్లు ఉత్ప‌త్తి చేసేందుకు దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో ప్ర‌ముఖ కంపెనీలు రావ‌డం ప‌ట్ల స్థానికులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here