గజల్ శ్రీనివాస్ కి సపోర్ట్ చేస్తున్న మినిస్టర్

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేదింపులు కేసు పై ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి, బిజెపి నాయకుడు అయినా మాణిక్యాలరావు స్పందించారు…ఈ సందర్భంగా మీడియాతో మాణిక్యాలరావు మాట్లాడుతూ గాయకుడు గజల్ శ్రీనివాస్ చిన్ననాటి నుండి నాకు తెలుసు అని గజల్ శ్రీనివాస్ ఇటువంటి వాడు కాదని అన్నారు….కుట్రపూరితంగా పథకం ప్రకారం జరిగింది కాబట్టి వీడియోలు చిత్రీకరించడం చేసారు అని మంత్రి మాణిక్యాలరావు న్నారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ,‘మీతో నేను వాదించదలచుకోలేదు. నా అభిప్రాయం నేను చెప్పాను. ఏదైనా డిస్కషన్ ఉంటే బయట మాట్లాడతాను. మీకంటే గట్టిగా నేనూ మాట్లాడగలను. మీడియా ముందు మాట్లాడుతున్నాను కనుక, సంప్రదాయకమైన భాషలో మీతో మాట్లాడాలి.. ఈ మైకు ఆన్ లో ఉండగా చక్కగా మాట్లాడతా, అంతకుమించి వద్దు’ అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here