అజ్ఞాత వాసి మొదటి రోజు టార్గెట్ ఇదే , ఎవ్వరూ సాధించలేదు

తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా అజ్ఞాతవాసి సినిమా కోసం ఎదురుచూస్తుంది .దర్శకుడు త్రివిక్రమ్ హీరో పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఇదివరకే రెండు హిట్లు కొట్టి మంచి జోరు మీద వున్నారు ఈ క్రమంలో ఈ సినిమాతో హట్రిక్  కొట్టాలని కసితో వున్నా రు.ఈ సినిమా విడుదల సమయానికి మార్కెట్లో ఏ సినిమా లేకపోవడం డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో కలిసొచ్చిన సమయం కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువ మొత్తం ఓటర్లలో షోలు పట్టటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

దీంతో పెట్టిన పెట్టుబడి దాదాపుగా రాబట్టుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని  థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశీ మార్కెట్ కూడా టార్గెట్ చేస్తూ ఎక్కువ మొత్తం థియేటర్లలో విడుదల చేయడానికి సిద్దం అయినట్లు సమాచారం… ఎందుకంటే విదేశీ మార్కెట్ లో త్రివిక్రమ్ సినిమాకు మంచి  గిరాకి ఉంది.. దానితో పాటు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉండటంతో యూఎస్‌లో అయితే మాత్రం ఈ చిత్రం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతోంది.

ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఈ మూవీ రిలీజ్ చేయని స్థాయిలో ఏకంగా 580 లొకేషన్స్‌లో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం కేవలం ప్రీమియర్స్‌తోనే అక్షరాల 2 మిలియన్ డాలర్స్‌ని కొల్లగొడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.”బాహుబలి”సినిమా (470 లోకేషన్స్)రిలీజ్ అయి 3 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసింది. ఈ క్రమంలోకనీసంఅజ్ఞాతవాసిరెండు మిలియన్ల మార్పు దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి,మరి.. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుందా? లేదా? వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here