రాజమౌళి ని గురించి నిజాలు బయటపెట్టిన గోగినేని

బాహుబలి సినిమా ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమను మరో మెట్టుకు ఎక్కించిన దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడూ ఓ వివాదానికి కేంద్రం అయ్యాడు. వ్యక్తిత్వ పరంగా వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి నాస్తిక వాదానికి సంబంధించిన విషయమై ప్రముఖ హేతువాది ఇండియన్ హ్యూమనిస్ట్- రేషనలిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ బాబు గోగినేని ద్వారా తీవ్రంగా  విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే రాజమౌళి  ఓ టి.వి  చానల్ ఇంటర్వ్యూలో భాగంగా తాను నాస్తికుడని చెప్పుకున్నాడు.తను అలా చెప్పుకోవడమే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది. నాస్తికుడు అంటే అర్థం దేవుడు లేడని వాదించేవాడు,దేవుడిని నమ్మనివాడు….ఈ క్రమంలో రాజమౌళి దేవుడు లేడనే చెబుతూ గుళ్ళు, గోపురాలను దర్శించుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది.

ఈ క్రమంలో బాబు గోగినేని రాజమౌళి ని తప్పుబ ట్టారు….తనలా దేవుడు లేడని నమ్ముతూ బతికే నాస్తికులు చాలామంది ఉన్నారని చెప్పిన బాబు గోగినేని అన్నారు .. ఈ ప్రపంచంలో వంద కోట్ల మందికిపైగా మతం లేకుండా దేవుడిని నమ్మకుండా ఉంటున్నారని తెలిపారు. అయితే.. రాజమౌళి వంటి వాళ్ల వల్ల తమలాంటి వాళ్లు బద్నాం అవుతున్నామన్నారు. అంతేకాకుండా రాజమౌళి తన తీరు మార్చుకోవాలని బాబు గోగినేని ఈ సందర్బంగా  సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here