రామ్ చరణ్ కి అనసూయ ఏమవుతుంది ?

మెగా పవర్ స్టార్ రామ్ చరన్ హీరో గా దర్శకుడు సుకుమార్ కలయికల వస్తున్న “రంగస్థలం 1985” సినిమాలో చాలా విశేషాలు చోటుచేసుకున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.. ప్రస్తుతం ఈ సినిమా యొక్క తుది షెడ్యూల్ రాజమండ్రి  పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం మరో విశేషం. అంతేకాకుండా ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే యాంకర్, నటి అనసూయ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్య భూమికని పోషిస్తున్నారు.ఈ నేపథ్యంలో అనసూయ ఈ సినిమాలో చేస్తున్న పాత్రలపై ఆ మధ్య అనేకమైన పుకార్లు షికార్లు కొట్టాయి.

అయితే ఈ సినిమాలో అనసూయ రామ్ చరణ్ కు  మేనత్తగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ నుండి సమాచారం.ఈ సినిమాను మైత్రి మూవీ  మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం దేవీశ్రీప్రసాద్ అందిస్తున్నాడు.. ఈ సినిమా మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here