అజ్ఞాత వాసి కాపీ అనడానికి ఈ ఒక్క ప్రూఫ్ చాలు

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “అజ్ఞాతవాసి” సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అజ్ఞాతవాసి టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా హాలీవుడ్  ‘లార్గో వించ్’కి కాపీ అని ప్రచారం జరుగుతూనే వస్తోంది. ఇది బెల్జియంకు చెందిన ఒక నవల ఆధారంగా 2008లో ఈ సినిమాను తెరకెక్కించి విడుదల చేయడం జరిగింది..ఇప్పుడు ఈ లార్గో వించ్’ ఆధారం చేసుకుని  త్రివిక్రమ్ “అజ్ఞాతవాసి” తెరకెక్కించాడని ఇండస్ట్రీలో పెను దుమారం అయ్యింది.
ఈ వార్త అటూ ఇటూ చక్కర్లు కొడుతూ చివరాఖరికి ‘లార్గో వించ్’ సినిమా డైరెక్టర్ జిరోమ్ సెలేకి దగ్గరకు చేరింది…ఈ సందర్భంగా హాలీవుడ్ డైరెక్టర్ ఆసక్తికరమైన  ట్వీట్ చేశాడు….‘‘‘టీ-సిరీస్’ సంస్థ ‘అజ్ఞాతవాసి’ సినిమాకి లీగల్ నోటీసులు పంపేందుకు రెడీ అయ్యింది’’ అని ఒక వార్త రాసిన ఒక వెబ్‌సైట్ లింక్‌ని షేర్ చేస్తూ.. ‘‘నేను ‘అజ్ఞాతవాసి’ టికెట్ కొనబోతున్నాను. ఆ సినిమా చూసేందుకు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నా’’ (”I think I’m gonna buy a ticket (plane first than movie) #Curiosity #Agnyaathavaasi #LargoWinch”) అంటూ ట్వీట్ చేశాడు..
ఈ క్రమంలో తాను తీసిన ‘లార్గో వించ్’ సినిమా హాలీవుడ్లో ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై ఆ డైరెక్టర్ కి కొంత ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ ‘లార్గో వించ్’ సినిమా ఛాయలు కనబడితే T series ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.. ఇప్పటికే ఈ సినిమా విషయమై లీగల్  నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.ఇదో పెద్ద వివాదంగా మారేలా కనిపిస్తోంది. మరి.. త్రివిక్రమ్ దీన్ని ఎలా తెరకెక్కించాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here