ప్రభాస్ బాలీవుడ్ లో ఇలా ఎంట్రీ ఇస్తాడు

బాహుబలి వంటి భారీ విజయంతో మంచి జోరుమీద ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్లో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాలీవుడ్ లో బాహుబలి  రెండు పార్ట్ ల ను రిలీజ్ చేసిన కరణ్ జోహార్  ఆ మధ్య కొన్ని రొమాంటిక్ కథలను ప్రభాస్ కు వినిపించాడని అప్పట్లో రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ లో నటించడానికి హీరో ప్రభాస్ పచ్చ జెండా ఊపినట్లు  సమాచారం.

ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే తను రెండు సంవత్సరాల క్రితమే బాలీవుడ్‌లో నటించేందుకు సైన్ చేసినట్లు స్వయంగా ప్రభాస్ ఒక వార్తా పత్రికకి వెల్లడించారు. ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం వెలువడలేదు. ప్రభాస్‌కున్న‌ కమిట్‌మెంట్స్‌ అన్ని పూర్తయిన తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈలోపల ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తిచేసుకుని తీరిగ్గా బాలీవుడ్ బరిలో దిగాలని ఈ బాహుబలుడు అనుకుంటున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. జిక్యూ మేగ‌జైన్ క‌వ‌ర్ పేజ్‌పై ఉన్న‌ ప్ర‌భాస్ స్టైలీష్  స్టిల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here