పవన్ కళ్యాణ్ ఖర్సై పోతాడు – మహేష్ కత్తి

ఓ తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్ వేదికగా చర్చావేదిక లో పాల్గొన్న ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి  పవన్ కళ్యాణ్ అభిమాని దిలీప్ సుంకర  మధ్య చర్చ వేడివేడిగా జరిగింది మాటల తూటాలు పేలి నాయి …ఈ క్రమంలో మహేష్ కత్తి ఘాటుగా విమర్శించారు అంతేకాకుండా ఓ దశలో ఆయన సంయమనం కోల్పోయారు. ఈ విషయమై మహేష్ కత్తి స్పందిస్తూ ఫేస్బుక్ వేదికగా వివరణ ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలో మహేష్ కత్తి స్పందిస్తూ నామీద వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమానులు లేనిపోని ఆరోపణలతో దాడి చేస్తున్నారని అంతేకాకుండా నాకు ఒక రాజకీయపార్టీకి సంబంధం అంటగడుతున్నారని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు డబ్బులు ఇస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నరు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నామీద ఎంత దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు తమాషా చూస్తున్నారు.నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలపై మాట్లాడలేదు.

కేవలం ఆయన ఉద్దేశాలు గురించి, రాజకీయాల గురించి మాత్రమే చర్చావేదికలో పాల్గొన్న అన్ని ప్రశ్నించడం జరిగింది అని కత్తి మహేష్ అన్నారు….ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కత్తి మహేష్ వార్నింగ్ తో కూడిన ఓ సందేశం ఇచ్చారు అదేంటంటే….మర్యాద హద్దులు దాటుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నేను ఇంకా మర్యాదలు దాటకుండానే సమాధానం ఇస్తున్నాను. ఇంకా సంయమనం పాటిస్తూనే ఉన్నాను. ఆ చెలియలకట్ట తెగేదాకా తీసుకురాకండి. అది జరిగిన రోజున ఖర్చైపోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి’ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here