దోమ‌ల్ని త‌రిమికొట్టే స్మార్ట్ ఫోన్

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే దోమ‌ల బెడ‌ద విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్ల‌లకు కుట్టే దోమ‌ల వ‌ల్ల అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అయితే ఈ దోమ‌ల దండును త‌రిమికొట్టేందుకు ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ సంస్థ ఎల్ జీ స‌రికొత్త ఒర‌వ‌డి సృష్టించింది. ‘కే7ఐ పేరిట స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుద‌ల చేసింది. ఈ ఫోన్ తో దోమ‌ల్ని త‌రిమికొట్ట‌వ‌చ్చని ఆసంస్థ ప్రతినిధులు తెలిపారు.  ఫోన్ వెనుక భాగంలో అమర్చిన ప్రత్యేక ప్యానెల్ నుంచి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ వస్తాయి. ఆ సౌండ్ వేవ్స్ వ‌ల్ల దోమ‌లు పారిపోతాయ‌ని, వీటివల్ల మ‌నుషుల‌కు మాత్రం ఎటువంటి హాని జ‌ర‌గ‌ద‌ని హామి ఇచ్చారు.
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
 స్క్రీన్ రిజల్యూషన్ 1280 x 720 పిక్సల్స్
క్వాడ్‌కోర్ ప్రాసెసర్ – 1.4 గిగాహెడ్జ్
  ర్యామ్ – 2 జీబీ
  స్టోరేజ్ – 16 జీబీ
ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,-  32 జీబీ
సిమ్  –  డ్యుయల్ సిమ్,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here