రేష‌న్ బియ్యం కేసులో ప్ర‌ధానికి జైలు శిక్ష‌

ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కంలో లోపాలుంటే మ‌న‌దేశంలో ఎలాంటి శిక్ష‌లు వేస్తారో మ‌న‌కు తెలియంది కాదు. మ‌న‌వాడైతే చూసి ఊరుకుంటారు. అపోజిష‌న్ అయితే కేసు..కేసు అంటూ క‌థ‌ను కంచికి చేరుస్తారు. కానీ విదేశాల్లో మాత్రం శిక్ష‌లు క‌ఠినంగా ఉంటాయి. థాయిలాండ్ కు చెందిన  మాజీ ప్ర‌ధాని ష‌న‌వ‌త్రా 2011లో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌ధాని ప‌ద‌వి ద‌క్కించుకుంది. ఆమె అధికారంలో ఉండ‌గానే పలు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింది. ముఖ్యంగా స‌బ్సిడీ బియ్య ప‌థ‌కం.

ఈ ప‌థ‌కం ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. కానీ నిర్వ‌హణ‌లోపం వ‌ల్ల కార్య‌రూపం దాల్చ‌లేదు. ష‌న‌వ‌త్రా ఆమె ప్ర‌భుత్వంలో ఉండ‌గా 2014 సైన్యం ఆమె ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసింది. స‌బ్సిడీ బియ్యం ప‌థ‌కం వ‌ల్ల ప్ర‌భుత్వానికి వంద‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని ప్ర‌ధానిపై కేసులు పెట్టింది. కేసు విచార‌ణలో భాగంగా ఆమె  హాజ‌ర‌వ్వాల్సి ఉంది. కానీ శిక్ష‌లు మ‌రింత క‌ఠినంగా ఉండ‌టం వ‌ల్ల దేశం విడిచి పారిపోయిన‌ట్లు స్థానిక పత్రిక‌లు క‌థ‌నాల్ని ప్ర‌చురించింది. దుబాయ్ లో ఆమె సోదరుడికి సొంత ఇల్లు వుందని అక్కడకు ఆమె వెళ్లిపోయారని ఆ వర్గాలు చెప్పాయి. అయితే ఆమె కోర్టుకు హాజ‌రు కాక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వం ఐదు సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌ను విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here