బిగ్ బాస్ రెండో సీజ‌న్ లో పాల్గొనే సెల‌బ్రిటీలు ఎవ‌రంటే

తెలుగు బిగ్ బాస్ షో ఎంత హిట్ అయ్యిందో మ‌నంద‌రికి తెలిసిందే. షో ప్రారంభంలో పార్టిసిపెంట్స్ విష‌యంలో కొంత డౌన్ ఫాలో అయినా..రాను రాను షో ఆసంతం ర‌స‌వ‌త్త‌రంగా సాగి, క్రిటిక్స్ అంచ‌నాల్ని తారుమారు చేసింది. ఇందులో విన్న‌గా శివ‌బాలాజీ విజ‌యం సాధించారు. అయితే మొద‌ట్లో రేటింగ్స్ ప‌రంగా కొంత మీమాంస‌లో ఉన్న బిగ్ బాస్ ..మొద‌టి మూడువారాలు ముగిసి నాలుగోవారంనుంచి షోను వీక్షించే ప్రేక్ష‌కుల‌సంఖ్య ఊపందుకుంది. షోలో రియాలిటీ కానీ, పార్టిసిపెంట్స్ టాస్క్ లు, గొడ‌వ‌లు, గిల్లిగ‌జ్జాల‌తో రేటింగ్స్,  యాడ్స్ ఇబ్బ‌డిముబ్బ‌డిగా వ‌చ్చిప‌డ్డాయి. అయితే దీనిపై మ‌రింత దృష్టిసారించిన మాటీవీ రెండో సీజ‌న్ ను త్వ‌ర‌లో ప్రారంభించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తుంది. ఇందులో భాగంగా టాలీవుడ్ నుంచి మొత్తం 14మంది పార్టిసిపెంట్స్ తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. వారిలో
1.   ఛార్మి.
2.   ధన్య బాలకృష్ణ,
3.   గజాల.
4.  గీతామాధురి,
5.    లాస్య,
6.    ఛాందిని చౌదరి,
7.ఆర్యన్‌ రాజేష్‌,
8.   తరుణ్‌,
9.  ఓంకార్‌
10.   వైవా హర్ష,
 11.    శ్రీదేవి,
12.  తనీష్‌,
13.   వేణు మాధ‌వ్ ,
14. వరుణ్‌ సందేశ్‌లతో స్టార్‌ మా చర్చలు జరిపింది. అయితే రెండో సీజ‌న్ 2018మార్చి, ఏప్రిల్ నుంచి ప్రారంభం కావ‌చ్చున‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి చ‌ర్చ‌ల అనంత‌రం వీరిలో ఎంత‌మంది ఉంటారో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here