స్పైడర్ సినిమా : తెర చింపేసిన మహేష్ బాబు ఫాన్స్

విడుదలకు ముందు “స్పైడర్” సినిమా టికెట్లుకున్న క్రేజ్ తెలియనిది కాదు. దీనిని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునేందుకు గుంటూరు జిల్లాలో ఓ ధియేటర్ యాజమాన్యం చేసిన ఓ ప్రయత్నం చివరికి ప్రిన్స్ అభిమానుల నుండి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. “స్పైడర్” సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శిస్తామని చెప్పి… ప్రిన్స్ అభిమానులకు ఒక్కో టికెట్ ను దాదాపుగా 500 రూపాయలకు అమ్మారు.
అంత డబ్బులు పెట్టి కూడా టికెట్లు కొన్న అభిమానులకు ధియేటర్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఉదయం 6 గంటలకే ప్రసారం కావాల్సిన ఈ బెనిఫిట్ షోను, 10 గంటలకు ప్రదర్శిస్తామని చెప్పడంతో అభిమానుల ఆగ్రహం చెందారు. అందరి కంటే ముందుగా వేకువజామునే సినిమా చూడాలని 500 పెట్టి కొనుగోలు చేస్తే, దానిని రెగ్యులర్ షో మాదిరి ప్రదర్శిచడం ఏంటి అంటూ ధియేటర్ యాజమాన్యంపై మండిపడ్డారు.
అంతేకాదు వారి ఆగ్రహానికి ధియేటర్ అద్దాలు బద్దలు కాగా, తెరను, సీట్లను కూడా ధ్వంసం చేసారు. అలాగే తమ దగ్గర నుండి వసూలు చేసిన ఎక్స్ ట్రా మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here