కొంచెం బీరు తాగండి..క్రియేటీవ్ గా ఆలోచించండి.

యువ‌తీ, యువ‌కులు పార్టీ అంటే చాలు. కేసుల‌కు కేసులు బీరు ప్రీతిపాత్రంగా తాగుతారు. కొంత‌మంది ఎన‌ర్జీకోసం, మొహం లో గ్లో పెరుగుతుంద‌ని తీసుకుంటారు. అలా బీరును ఇష్టాను సారంగా  తాగడం వ‌ల్ల వారిలో ఉన్న క్రియేటివిటీ త‌గ్గిపోతుంద‌ని ఆస్ట్రియాకు చెందిన యూనివ‌ర్సిటీ ఆఫ్ గ్రాజ్ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.
ఎక్కువ బీరు తాగిన వారు ..త‌క్కువ బీరు తాగిన వారి బిహేవియ‌ర్, ఆరోగ్యం, తెలివితేట‌ల గురించి ఓ 70జంటల‌పై ప‌రిశోద‌న‌లు చేయ‌గా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఎక్కువ బీరు తాగిన వారికంటే త‌క్కువ బీరు తాగిన వారి ఆలోచ‌న‌లు చాలా క్రియేటీవ్ గా ఉంటాయ‌ని ..ఎక్క‌వ బీరు తాగిన వారి ఆలోచ‌న‌లు అంత ఎఫెక్టీవ్ గా ఉండ‌వ‌ని చెబుతున్నారు.
వ‌న్ వ‌ర్డ్ అసోసియేష‌న్ టెస్ట్ లో మగాళ్లయితే ఓ పింట్ బీరు (దాదాపు 500 ఎంఎల్), ఆడవాళ్లయితే 350 ఎంఎల్ బీర్ తాగితే వారి స్కోరు సుమారు 40 శాతం పెరిగిందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here