బాలయ్య కోసం వివేక్ ఒబెరాయ్ విలన్ అయ్యాడు

బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుందట. ఈ పాత్రను వివేక్ ఒబెరాయ్ చేస్తేనే పూర్తి న్యాయం జరుగుతుందని దర్శక నిర్మాతలు భావించారు.
ఈ విషయంపై వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించడం .. ఆయన అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. తాజాగా ఫిల్మ్ నగర్లో ఇదే టాక్ వినిపిస్తోంది. గతంలో వివేక్ ఒబెరాయ్ తెలుగులో ‘రక్త చరిత్ర’ సినిమాలో నటించాడు. రీసెంట్ గా తమిళంలో వచ్చిన ‘ వివేగం’ సినిమాలోను ఆయన మెప్పించాడు. ఇక బాలకృష్ణ మూవీలో వివేక్  ఒబెరాయ్ చేయడం నిజమే అయితే, అది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here