ఆ కేసులో దిలీప్ కి ఊరట ఇచ్చిన కోర్టు

మ‌ల‌యాళ న‌టి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటోన్న న‌టుడు దిలీప్‌కు ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది. మంగ‌ళ‌వారం ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ కేర‌ళ హైకోర్టు తీర్పునిచ్చింది. జూలై 10న అరెస్టైన దిలీప్ ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సార్లు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నాడు.
అందులో మూడు సార్లు కేర‌ళ హైకోర్టును, రెండు సార్లు దిగువ కోర్టును సంప్ర‌దించాడు. అయితే ఈ కేసులో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌క్కాగా ఆధారాలు ఉండ‌టంతో ఇప్ప‌టివ‌ర‌కు బెయిల్ మంజూరు కాలేదు.
ఆయ‌న‌కు బెయిల్ ఇస్తే.. కేసులో సాక్ష్యాలు తారుమారు కావ‌డం, ఆధారాల ట్యాంప‌రింగ్ జరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్రాసిక్యూష‌న్ వాదించ‌డంతో న్యాయ‌స్థానాలు బెయిల్ మంజూరు చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఐదో సారి ఆయన బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కాడు. ఈసారి దిలీప్ అభ్య‌ర్థ‌న‌ను అంగీక‌రిస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 85 రోజుల జైలు జీవితం గ‌డిపిన త‌ర్వాత ఎట్ట‌కేల‌కు దిలీప్ బెయిల్ మీద బ‌య‌ట‌కు రానున్నాడు. ఇటీవ‌ల దిలీప్ న‌టించిన ‘రామ్‌లీల’ సినిమా విడుదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here