11 సంవత్సరాల వయసులో ఎయిడ్స్ వచ్చింది … ఇప్పుడు ఆమె ఏం చేస్తోందో తెలుసా ?

ఇదొక అతిగొప్ప విజయగాధ గా చెప్పుకోవాలి ఏమో. పదకొండు సంవత్సరాల వయసు లోనే ఎయిడ్స్ కి గురైన ఒక యువతీ ఆమెలోని ఆత్మ విశ్వాసం ఎక్కడా పోగొట్టుకోకుండా గట్టిగా పోరాటం చేసింది. ఆమె ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఎదిగి క్రమం గా బ్రిటన్ లోని మిస్ కాంగో కిరీటం దక్కించుకుంది. ఆత్మవిశ్వాసమే తన గొప్ప ఆయుధం అని చెబుతున్న ఆమె స్త్రాట్ ఫోర్డ్ టౌన్ హాల్ లో పోటీపడి 2017 సంవత్సరానికిగాను ఈ కిరీటం దక్కించుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ప్రస్తుతం ఆ యువ‌తి లండన్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో చదువుకుంటోంది.” జీవితం లో నాకంటూ ఎదో ఒకటి ఉంది అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఈ కిరీటం దక్కింది. ఇది కనిపించినంత తేలిక వ్యవహారం కాదు. ఎన్నో సంవత్సరాలు గుక్క పెట్టి ఒక్కదాన్న్నీ ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. లండ‌న్‌నుంచి తిరిగి కాంగోకు వెళ్లిపోయి, హెచ్‌ఐవీ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వ‌హిస్తా ఎయిడ్స్ మహమ్మారి మీద నా పోరాటం సాగుతుంది ” అంటోంది ఆమె

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here