బాబు గారికి అలా టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతోంది

ఎందుకో ఈ ఏడాది బాబుకు ఏం క‌లిసి రావ‌డం లేదు.అప‌శ‌కునాలు క్యూలో నిల‌బ‌డి మ‌రీ వ‌చ్చేస్తున్నాయి.దీంతో బాబుకు ఏం చేయాలో అర్ధం కాని స్థితి.దీనికి తోడు సోష‌ల్ మీడియాలో త‌న కుమారుడు లోకేష్ ను అంతా ప‌ప్పుగాడిగా కాల్ చేయడం  బాబుగారికి ఏమాత్రం న‌చ్చ‌డం లేదట‌.టీవీ ఛాన‌ల్ అయితే కంట్రోల్ చేయెచ్చు.కాని సోష‌ల్ మీడియాను కంట్రోల్ చేయ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నికాదు క‌దా.
 ప్ర‌జెంట్ బాబుకు ఎక్క‌డో బ‌య‌టోళ్ల ద‌గ్గ‌ర నుంచి కాకుండా… అయిన‌వారి ద‌గ్గ‌ర‌నుంచే ఆప‌ద‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి.ఇవే ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రాలై పోయాయి.ఏదో ఒక వంక‌తో తెలుగు త‌మ్ముళ్లు నిత్యం వార్త‌ల్లో కెక్క‌డం బాబుగారికి సుతారమూ న‌చ్చ‌డం లేదు.కాని ఏం చేస్తాం ఎవ‌రి ఇన్ టెన్ష‌న్ వారిది.ర‌క‌ర‌కాల ప్ర‌జెంటేష‌న్ల‌తో మీద ప‌డిపోతున్నారు.
 
ఎమ్.పి. శివ ప్ర‌సాద్ ,బొండా ఉమ‌,కేశినేని నాని, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ,బొజ్జ‌ల‌,గోర్లంట్లతో స‌హా చాలామంది ప్ర‌ముఖులు  చంద్ర‌బాబుపై తిరుగుట‌పా ఎగ‌రేసిన‌వారే.బొజ్జ‌ల‌,బొండాలు ఏదో సైలంట్ అయ్యారు.కాని కేశినేని నాని,ఎమ్ పి శివ‌ప్ర‌సాద్ లు కామ్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు.వారి ఇన్ టెన్ష‌న్ బాబుగారికి కాస్త తేడా కొట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది.అందుకే వారిపై అనుచ‌రుల క‌న్ను వేసేలా చేశారు.మొత్తానికి ఐతే బాబుగారికి టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here