సిగిరెట్టు కోసం .. చిన్న పిల్లాడికి వాతలు పెట్టాడు , ప్రాణాపాయం !

సిగిరెట్టు , పది రూపాలు వీటికోసం ఒక బాలుడికి నరకం చూపించిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బేస్తవారి పేట మండలం నేకునాంబాదు కి చెందిన మెట్టెల కుమారి కొడుకు వెంకటరావు కి వాదాల నరేంద్ర అనే వ్యక్తి సిగిరెట్టు తెమ్మని పది రూపాయలు ఇచ్చాడు. ఆటల గొడవ, స్కూలు కి టైం అవుతోంది అనే కంగారు లో ఆ విషయమే మర్చిపోయిన ఆ పిల్లాడు తిను బండారాలు కొనుక్కుని తినేసాడు. కాసేపటికి ఈ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఆ బాలుడికి ఎదురు పడగా .. సిగిరెట్ విషయం మర్చిపోయాను అనీ డబ్బులతో ఏవో కోనేసుకున్నాను అనీ తన తల్లిని అడిగి డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పాడు.

ఇదంతా విని కోపం తో ఊగిపోయిన నరేంద్ర ఆ కుర్రాడిని ఇంటికి తీసుకెళ్లి రాత్రంతా బంధించాడు. అంతేకాక సిగరెట్‌ కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టాడు. వెంటనే కంభం ఆసుపత్రి కి ఈ బాబుని తీసుకువెళ్ళారు పెద్దవాళ్ళు. అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here