పూరీ vs వెంకటెష్ గెలుపు ఎవరిది ?

ఇవాళ పూరీ జగన్నాథ్ సినిమా రోగ్ , వెంకటెష్ సినిమా గురు థియేటర్ లలోకి వచ్చేసాయి. గురు సినిమా తర్వాత డబ్భై ఐదవ చిత్రం తనది పూరీ తో చెయ్యాలి అనేది వెంకటేష్ ప్లాన్ కానీ అది జరగలేదు. స్టొరీ డిస్కషన్ జరిగి అంతా ఓకే అనుకున్న టైం లో వెంకటేష్ ని కాదు అనుకుని బాలయ్య వెనక పడ్డాడు పూరీ జగన్నాథ్. దాదాపు నలభై కోట్ల బడ్జెట్ సినిమాకి పూరీ ని నమ్మి డబ్బు పెడతాను అని చెప్పిన వెంకటేష్ కి పూరీ హ్యాండ్ ఇచ్చాడు అని వార్తలు వినపడ్డాయి. సో వీరిద్దరి మధ్యనా ఆ తరవాత నుంచి మాటలు సరిగ్గా లేవట , సో ఇద్దరూ ఒకే రోజు పోటా పోటీ గా తమ సినిమాలు విడుదల చేసారు.

తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఇరుదు సుట్రు’కు రీమేక్ ఈ చిత్రం. ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన సుధ కొంగర గురు ని తెలుగులో కూడా తీసింది. పూరీ అయితే వరస డిజాస్టర్ సినిమాలతో విసిగిపోయి ఉన్నాడు. . సో రెండు సినిమాలూ ఇవాళ థియేటర్ లలో రాగా రోగ కి బాగా నెగెటివ్ టాక్ విన్పిస్తోంది. వెంకటేష్ పూరీ మీద ఈ సందర్భంగా గెలిచాడు అనే అనుకోవచ్చు. స్పోర్ట్స్ జనాలకి , ఆ తాలూకా ప్రేక్షకులకి గురు బాగా నచ్చుతుంది అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here