శంకర్ కొత్త ప్రయత్నం .. మీడియా కోసం

డైరెక్టర్ శంకర్ బృందం ఈ మధ్యన ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసిన సంగతి తెలిసిందే . ఆ విషయం మీద చాలా పెద్ద దుమారమే చెలరేగింది. శంకర్ స్వయంగా ప్రెస్ మీట్ లో సారీ చెప్పి అందరినీ కూల్ చేసాడు. ఈ గొడవ కి ఫుల్ స్టాప్ పెట్టి సర్దు మణిగేలా చేసిన శంకర్ అక్కడితో ఇది వదలడం లేదు. ఎందుకంటే శంకర్ సారీ చెప్పిన కూడా కాలీవుడ్ పత్రికలూ, వెబ్ మీడియా ఈ సినిమాకి సంబంధించి పట్టించుకోవడం మానేసాయి. వారి సినిమా విషయాలు ఎక్కడా బయటకి పొక్కడం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ భారీ స్థాయిలో తగ్గిపోవడం తో శంకర్ ఇలా కాదు అనుకుని మళ్లీ రంగంలోని దిగాలని చూస్తున్నాడట.

మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి .. జర్నలిస్ట్ లను బుజ్జగించే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. మరొక వింత ప్రయత్నం తో అందరినీ ఆకట్టుకోవాలి అనేది శంకర్ ప్లాన్ . రోబో సినిమా షూటింగ్ దాదాపు గా అయిపోవచ్చినా కూడా ఇంకా మీడియా లో ఏఎ న్యూస్ రాకపోవడం శంకర్ ని కలచి వేస్తోంది. ఎవరో చేసిన తప్పు కి సినిమా బృందం మొత్తాన్నీ ఇబ్బంది పెట్టద్దు అంటున్నాడు శంకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here