షాక్ ఇచ్చిన మోడీ .. బంగారం అమ్మితే డబ్బులు రావు ..

ప్రస్తుత మోడీ సర్కారు నగదు లేని భారత దేశాన్ని చూడడమే లక్ష్యంగా తన పని తాను చేసుకుని పోతోంది. ఆ పంథా లోనే ఇప్పుడొక సరికొత్త కీలక నిబంధన అమలు చేసి షాక్ ఇస్తోంది ఈ భారత ప్రభుత్వం. ఆర్ధిక కష్టాలు ఇప్పటికే తలనోప్పులలో ఉండగా బంగారాన్ని అమ్ముకుని బతుకుతున్న వారు , పెళ్ళిళ్ళు చేస్తున్న వారు బోలెడు మంది ఉన్నారు. మధ్య తరగతి ప్రజల డబ్బు ఎప్పుడూ బంగారం సేవింగ్స్ లోనే ఉంటుంది. కానీ ఇక మీదట ఎవరైనా బంగారం అమ్మితే గనక పది వేల రూపాయల్ లోపు అయితేనే నగదు చెల్లించవచ్చు అని అంతకంటే ఎక్కువ అయితే చెక్కు కానీ ఆన్ లైన్ కానీ చెల్లించాలి అని కొత్త చట్ట చెబుతోంది.
ఎలాంటి పరిస్థితి వచ్చినా డబ్బు కోసం బంగారం అమ్ముకునే ఛాన్స్ పోయింది అనమాట , కావాలంటే చెక్కు – ఎకౌంటు రూపం లో ఈ వ్యవహారం నడవాలి అంతే .. ఒక లక్ష ఎవరికైనా అర్జంట్ గా ఇవ్వాలి అంటే డబ్బు లేదు బంగారం అమ్మి ఇవ్వాలి అంటే కనీసం ఏడు రోజుల టైం లో కానీ ట్రాన్స్ఫర్ లు జరగవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here