హైపర్ ఆది .. బుద్ధి సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా అసలు నీకు ?

చిరంజీవి తమ్ముడు  నాగబాబు మరియు వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యాతలు గా ఉంటున్న తెలుగు కామెడీ షో జబర్దస్త్కార్యక్రమంపై  రోజు రోజుకు విమర్శల దాడి  పెరిగిపోతోంది .ఈ  కామెడీ షో లో అసభ్యత శ్రుతి  మించుతోంది అని సభ్యత సంస్కారం లేకుండా పోయింది అనే విమర్శలు వినపడుతూ ఉన్నాయి  . ఈ మధ్య అనాథలు, మహిళలు, వికలాంగులను కించపరిచేలా వారి మనోభావాలూ దెబ్బ తినేల చాలా  జోకులు ఉంటున్నాయి….ఈ సందర్భంగా హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై అనాథ పిల్లలు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.

హైపర్ ఆది, రోజా, నాగబాబు, అనసూయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు….అనాధ బిడ్డలు జబర్దస్త్ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని కోరారు. అనాధ పిల్లలు ఆవేసపడే మగాడికి , సైలెంట్ గా ఉండే ఆడడానికి పుడతారు అనీ , వారి బతుకులే వేస్ట్ అన్నట్టు గా ఇష్టం వచ్చిన మాటలతో ఈ స్కిట్ నడిచింది. అనాథ పిల్లాడు హైపర్ అది దగ్గరకి రాగానే ” నీ మొఖం చూసి చిన్నప్పుడే చెత్త కుండీ లో పడేసి ఉంటారు ” అంటూ గేలి చేస్తాడు ఆది .

ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం లో ఆది ఇంటెన్సన్ ఏంటో కానీ విమర్శకులు మాత్రం అతని మీద ఒంటి కాలితో లేస్తున్నారు. మా వెబ్సైటు తరఫునుంచీ కూడా ఆది కామెంట్లు వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే లైఫ్ లో అమ్మా నాన్నా లేక అనాధలుగా ఎవరో ఒకరి జాలితో బతుకుతున్న పిల్లల పట్ల కామెడీ చెయ్యడం అంటే సిగ్గు ఉన్న మనిషి చెయ్యడు ఆ పని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here