హీరో సూర్య భార్య , హీరోయిన్ జ్యోతిక మీద పోలీస్ కేసు

ఇటీవ‌ల విడుద‌లైన ‘నాచియార్‌’ చిత్ర టీజ‌ర్‌లో న‌టి జ్యోతిక బూతు ప‌దం వాడిందంటూ కోయంబ‌త్తూర్‌కి చెందిన ఓ వ్య‌క్తి స్థానిక పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే రాజ‌న్, టీజ‌ర్‌లో జ్యోతిక వాడిన ప‌దాలు మ‌హిళ‌ల గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇప్పుడు ఆ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంద‌ని, స‌మాచార సాంకేతిక చ‌ట్టం సెక్ష‌న్ 67 ప్ర‌కారం అది త‌ప్పు అని రాజ‌న్ పిటిష‌న్‌లో తెలిపాడు. అలాగే ఐపీసీ సెక్ష‌న్ 294బి ప్ర‌కారం కూడా బూతుల‌ను మాట్లాడ‌టం శిక్షార్హం. ‘నాచియార్‌’ చిత్రంలో పోలీసు అధికారిగా న‌టిస్తున్న జ్యోతిక, దోషిని విచారించే క్ర‌మంలో బూతు వాడ‌టం టీజ‌ర్‌లో ఉంది. ఈ చిత్రానికి బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here