పద్మావతి సినిమా కోసం హత్య ? కాదు ఆత్మహత్య ?

జైపూర్‌లోని న‌హ‌ర్‌గ‌ర్ కోట‌గోడ‌కు ఉరివేసుకుని చ‌నిపోయిన ఓ యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది.వివరాలలోకి వెళ్తే మృతుడు చేతన్ కుమార్ సైని ,రామ్ రతన్ సైని అన్న తమ్ముళ్ళు. తన తమ్ముడు చన్నిపోయిన తీరు తనకు ఎంతో తీరని  వేదన కలిగించింది అనీ , తన తమ్ముడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్న రామ్ రతన్ అంటున్నాడు .

తన తమ్ముడు మరణానికి పద్మావతి సినిమాకు సంబంధం లేదని తెలిపాడు. చేతన్ కుమార్ సైని ఉర్రి వేసుకున్న సమీపంలో రాళ్ల మిద కొన్ని అర్థం లెన్ని  రాతలు రాశారు అని అన్నాడు. ‘మేం ప‌టాల‌ను మాత్ర‌మే ద‌గ్ధం చేయం’ అనే రాత‌ల‌తో పాటు ‘ప‌ద్మావ‌తి శ‌త్రువు’ అనే రాతప్ర‌తి అక్క‌డ ల‌భించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ వ్యాఖ్యలు వివాదాలను ,గొడవలను సృష్టించడానికి రాశారని కర్ని వర్గం తెలిపింది. జరిగిన ఘటన పట్ల తాము ఎంతో విచారం బాధ వ్యక్తం చేస్తూనం అని  క‌ర్ని సేన నాయ‌కుడు లోకేంద్ర సింగ్ క‌ల్వి తెలిపారు. ఈ చావు కీ పద్మావతి సినిమాకీ సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పద్మావతి సినిమా కోసం ఆత్మహత్య లేదా హత్య జరిగి ఉంటుందా లేదా అనే కోణం లో చూస్తున్నారు పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here