లవర్స్ ఇద్దరూ కిడ్నాప్ డ్రామా .. రోడ్డు మీద అడ్డంగా ఎలా దొరికరో చూడండి :

తను ప్రాణంగా ప్రేమించిన కుర్రాడి కోసం ఒక కిడ్నాప్ డ్రామా నడిపిన చిత్తూరు జిల్లా అమ్మాయి అడ్డంగా దొరికింది. వరదయ్య పాలెం కి చెందిన ఇరవై ఏళ్ళ అమ్మాయి ఒక కంపెనీ లో పని చేస్తోంది అక్కడ సతీష్ అనే ఒక సెక్యూరిటీ అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన ఆమె అక్క తమ తల్లితండ్రులకి చెప్పింది. దాంతో ఆమెని ఉద్యోగం మానిపించి సతీష్ ని మర్చిపోవాలి అంటూ వార్నింగ్ లు ఇచ్చారు. సతీష్ ని మర్చిపోయే ప్రయత్నం చేసిన ఆమె అతనికి కూడా తనని మరచిపోవాలని చెప్పింది.  సతీష్ వినకుండా, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

దీంతో శనివారం నాడు తాను తల్లితో కలసి ఆసుపత్రికి వస్తున్నానని, అక్కడ వీలు చూసుకుని తనను కిడ్నాప్ చయాలని చెప్పింది. సతీష్ కూడా ఆమె చెప్పినట్టే తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమెని కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడాడు. స్థానికులు వెంటనే ఆ కారుని బైకు తో వెంబడించి పట్టుకున్నారు. వెంటనే దొరికిన సతీష్ ఈ ఐడియా మొత్తం ఆ అమ్మాయిదే అంటూ ఆమె మీద తోసేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here