హిందూపురం నుంచి గుడివాడ కి ఎమ్మెల్యే గా బాలయ్య? .. ఆయన ఏమన్నారు ?

తాజాగా వస్తున్న మీడియా పొలిటికల్ న్యూస్ ప్రకారం రానున్న ఎన్నికల్లో చంద్రబాబు తన వియ్యంకుడు బాలకృష్ణ ని గుడివాడ నియోజికవర్గం లో ఎమ్మెల్యే గా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది .. హిందూపురం లో ఇప్పటికే బాలయ్య మీద నీలి నీడలు పడ్డం ఆయన అక్కడ జనాలని సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే వార్తలు హల్చల్ చేస్తూ ఉండడం తో బాలయ్య ఫాన్స్ దగ్గర నుంచీ హిందూపురం జనల వరకూ అందరూ ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. అయితే బాలయ్య మాత్రం ఈ విషయాన్ని ఓకే చెయ్యడం లేదు.

వచ్చే ఎన్నికల్లో సైతం తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని, అందులో ఎటువంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. షూటింగ్ కారణంగా గడిచిన ఎనిమిది నెలల టైం లో హిందూపురం లో ఉండలేకపోయిన మాట నిజమే అంటున్న బాలయ్య తాను ఎక్కడ ఉన్నా ప్రజల గురించే మాట్లాడతా అని చెప్పారు. అయితే గుడివాడ లో కొడాలి నానీ కి బాలయ్య ని చెక్ పెట్టె పనిలో చంద్రబాబు ఉన్నారు అనే న్యూస్ అబద్ధమే ఏమో ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here