ప్రమాదమా ? తాగేసి ఉన్నాడా ? రవితేజ తమ్ముడు చావు కి అసలు కారణం ఇదే !

గత అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు మీద అత్యంత వేగం తో స్కోడా కారుతో యాక్సిడెంట్ చేసి చనిపోయిన రవి తేజ తమ్ముడు కి సంబంధించి అనేక వార్తలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఆ కారు లో ఒక్కడే డ్రైవ్ చేస్తూ శంషాబాద్ నుంచి గచ్చి బౌలి వెళుతున్నాడు అని అంటున్నారు. ప్రమాద సమయం లో కారు ఆగి ఉన్న లారీ ని బలంగా గుద్దడం తో భరత్ స్పాట్ లో చనిపోయాడు. కారులో మద్యం బాటిళ్ళు కూడా ఉండడం తో అతను తాగేసి ఉన్నాడు అని కూడా అంటున్నారు. పోస్ట్ మార్టం పూర్తి అయితే కానీ ఈ విషయం మీద ఒక క్లారిటీ రాదు మరి.

ప్రమాదం గురించి ముందే పసిగట్టి బలంగా బ్రేకులు వేసినట్టుగా రోడ్డుపై పడ్డ టైర్ మరకలు చూపుతున్నాయని అన్నారు పోలీసులు. యాక్సిడెంట్ అయిన వెంటనే ఎడమ కాలు కుడి చెయ్యి పూర్తిగా విరిగిపోయాయి అనీ వెంటనే తలకి కూడా బలమైన గాయం తగిలింది అని చెబుతున్నారు. తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేసినా అర్ధరాత్రి టైం లో ఊరవతల ఔటర్ రింగ్ రోడ్ కావడం తో ఎవ్వరూ లేకపోవడమే అతని చావుకి కారణం అంటున్నారు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here