అల్లూ అర్జున్ దువ్వాడ జగన్నాథం ని కేలికేసాడా ?

దువ్వాడ జగన్నాథం సినిమా ఆడియో వేడుకలో కానీ సినిమా ఇంటర్వ్యూ లలో కానీ హరీష్ శంకర్ ఒక మాట ఎక్కువగా చెబుతూ వచ్చాడు . ఈ సినిమాకి అల్లూ అర్జున్ విపరీతంగా ఇన్ పుట్ లు ఇచ్చాడు అనీ క్యారెక్టర్ లు సైతం అతని చొరవ వలనే రూపు దిద్దుకున్నాయి అని అన్నాడు హరీష్. ఈ సినిమా క్లైమాక్స్ విషయం లో కూడా అల్లూ అరవింద్ సలహాలు, అర్జున్ సలహాలు వర్క్ చేసాయి అన్నాడు హరీష్ శంకర్. డైరెక్టర్ నుంచి ఎక్కువగా తీసుకునే గుణం ఉన్న హీరో బన్నీ అన్నాడు హరీష్.
అయితే అల్లూ అర్జున్ ఇన్వాల్వ్మెంట్ కాస్త ఓవర్ గా అయ్యాడు అని అనిపిస్తోంది. ఈ చిత్రం రోలింగ్‌ టైటిల్స్‌లోని మేకింగ్‌ వీడియోలు చూస్తే ఇందులో అల్లు అర్జున్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో అల్లు అర్జునే హరీష్‌ శంకర్‌ని డైరెక్ట్‌ చేస్తున్నట్టు కనిపించింది. డౌన్ లో ఉన్న హరీష్ శంకర్ స్టార్ హీరో దొరకడం తో అతను ఏది చెప్తే అది విన్నట్టు అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here