రాజమౌళి నా గురించి అలా అన్నాడు కదా .. ఇదే నా ఛాలెంజ్ – శ్రీదేవి

యాభై ఏళ్ళ కెరీర్ తో ఎవ్వరికీ సాధ్యం కాని కెరీర్ ని సాధించుకుంది హీరోయిన్ శ్రీదేవి. లేటు వయసులో కూడా ఆమెకి అద్భుతమైన ఇమేజ్ ఉంది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఆమె నటన, వైభవం తమ సినిమాలో ఉంటె చాలు అన్నట్టు ఫీల్ అవుతున్నారు డైరెక్టర్ లు. అప్పట్లో అందం తో కుర్రకారు మతి పోగొట్టిన ఆమె తరవాత పెళ్లి చేసుకుని ముంబై వెళ్ళిపోయింది. ఇంగ్లీష్ వింగ్లీష్ తో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీదేవి ఇప్పుడు మామ్ సినిమా విడుదల కి సిద్దం అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ ల కోసం అన్ని భాషల్లో ఇంటర్వ్యూ లు ఇస్తోంది ఆమె.

హైదరాబాద్ లో జరిగిన ప్రత్యెక ఇంటర్వ్యూ లో తన సినిమా గురించి చెబుతూనే బాహుబలి సినిమాలో తాను లేకపోవడం గురించి ఓపెన్ అయ్యింది ఆమె. మొన్నటి వరకూ రాజమౌళి తో సహా అందరూ ఆమె తమ సినిమాలో లేకపోవడం హమ్మయ్య అనుకున్నాం అనీ ఆమె రేంజ్ ని భరించలేక పోయాం అనీ చెప్పడం చూసాం దానికి సమాధానం చెప్పిన ఆమె, మౌళి మాటలు తనని బాధ పెట్టాయి అని చెప్పుకొచ్చింది. అసలు అలాంటి డిమాండ్ లు ఉంటె రిపీట్ గా డైరెక్టర్ లు తనని సినిమాల్లో ఎందుకు పెట్టుకుంటారు అని ప్రశ్నించిన శ్రీదేవి మూడొందల సినిమాలు ముప్పై సంవత్సరాల కెరీర్ సాధ్యమా అంటూ రాజమౌళి కి ఇన్ డైరెక్ట్ ఛాలెంజ్ విసిరింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here