వీడియో: వైఎస్ జ‌గ‌న్ గ‌తజ‌న్మలో హిస్ట‌రీ రిపీట్ చేశాడు!

సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల గ‌త జ‌న్మ‌ల విశేషాలు చెబుతూ సంచ‌ల‌నంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్. గ‌త జ‌న్మ‌లో ఎక్క‌డ ఏ రూపంలో జ‌న్మించారు? ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? ఎలా చ‌నిపోయారు? అనే విష‌యాల‌ను తెలుపుతూ ఎస్వీనాగ్‌నాథ్ చేస్తున్న ప్రొగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
గ‌త జ‌న్మ ఆవిష్క‌ర‌ణ 
ప్ర‌తి వారం ఒక సెల‌బ్రెటీ గ‌త జ‌న్మ తెలిపే ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ చేశాడు. జ‌క్క‌న్న‌ గ‌త జ‌న్మ‌ఎలా ఉండేది? గ‌త జ‌న్మ ఎక్క‌డ ఎలా సాగింది? అనే విష‌యాల‌పై నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.
వెస్ట్రాన్ కంట్రీలో జ‌న్మించిన జ‌గ‌న్
పూర్వ జ‌న్మ‌లో వైఎస్ జ‌గ‌న్ పాశ్చాత్య దేశంలో జ‌న్మించాడ‌ని అస్ట్రో సైకాల‌జిస్ట్ నాగ్‌నాథ్ తెలిపారు. జ‌గ‌న్ కుంభ‌ల‌గ్నంలో జ‌న్మించాడ‌ని,  ఎన్నో ఎమోష‌న‌ల్ ఫీలింగ్స్ ఎదుర్కొన్నాడ‌ని ఆయ‌న తెలిపారు. సైన్స్ ఆండ్ టెక్నాల‌జీ విద్య అభ్యాసించాడ‌ని తెలిపారు. గ‌త‌జ‌న్మ‌లో జ‌గ‌న్ చిన్న వ‌య‌సులోనే త‌ల్లిచ‌నిపోవ‌డం, తండ్రి రెండో పెళ్లి చేసుకోవ‌డం వంటి ప‌రిణామాలు జ‌రిగాయని తెలిపారు.
యోగా గురువుగా..
త‌న‌కంటూ వినూత్న‌మైన గుర్తింపుకోసం ఆహ‌ర్నిష‌లు కృషి చేశాడని, యోగా గురువుగా మారాడ‌ని నాగ్‌నాథ్ తెలిపారు. త‌ను చ‌దువుకున్న చ‌దువును ప‌క్క‌న పెట్టి కొత్త ఆలోచ‌న‌ల‌తో జీవితం గ‌డిపాడ‌ని ఆయ‌న తెలిపారు. మొండి స్వ‌భావంతో త‌ను అనుకున్న సాధించాల‌న్న క‌సితో ర‌గిపోయేవాడ‌ట‌. త‌నను తాను ప్ర‌పంచానికి ఫ్రూవ్ చేసుకోవ‌డానికి ప‌ట్టుద‌ల‌తో ఉండేవాడ‌ట‌. అతివిశ్వాసంతో జ‌గ‌న్ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నాడో నాగ్‌నాథ్ వివ‌రించారు.
నేను ఎవ‌ర్నీ..?
న‌మ‌స్తే తెలుగు ఛాన‌ల్‌లో హూ ఏమ్ ఐ(who am I) ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతోంది. ఇందులో ప్రముఖుల గ‌త జ‌న్మ ర‌హస్యాల‌ను జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు. ఇందులో తాజాగా ప్ర‌సార‌మైన రాజ‌మౌళి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ మారుతోంది.
 
వైర‌ల్ అవుతున్న ప్రొగ్రాం
సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్‌ల‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, ప్ర‌తి వారం ఒక ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతుంద‌ని ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ స్వామి ముద్దం తెలిపారు. తాజాగా ప్ర‌సారం చేసిన వైఎస్ జ‌గ‌న్ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెల‌బ్రెటీల పాస్ట్ లైఫ్‌ల‌ను ఆవిష్క‌రించే ఇలాంటి కార్య‌క్ర‌మం మీడియా చ‌రిత్ర‌లో తొలిసార‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here