నిన్న నిశిత్ నారాయణ..నేడు రవితేజ తమ్ముడు

వేగం తగ్గించండి.. ప్రాణాలు కాపాడుకోండి.. ఇది వాహనదారులకు పోలీసుల సూచన. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళక కల్గిస్తున్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమా? నిర్లక్ష్యపు డ్రైవింగ్ నిండు ప్రాణాలను బలితీసుకుంటుందా? అంటే వరుస ఘటనలు అదే చెప్తున్నాయి. మొన్న మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ ప్రమాదం మరిచిపోక ముందే మరో ఘటన విషాదం నింపింది.
సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఔటర్ రోడ్డుపై ప్రయాణిస్తున్న భరత్ కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారు వేగంగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బలమైన గాయాలు తగలడంతో.. భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారుకు ఉన్న బెలూన్ ఓపెన్ అయినా.. కూడా భరత్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే దానికి ఉన్న బెలూన్ సాంకేతికంగా పనిచేసిందా? అన్న సందేహాలు కల్గుతున్నాయి.
శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా రాత్రి 10 గంటలకు ప్రమాదం జరిగింది.  అర్ధరాత్రి.. చిమ్మచీకటి.. విశాలమైన రోడ్లు.. వాహనం అడ్డొస్తుందని.. లేదంటే.. సిగ్నల్ వస్తుందన్న ఆందోళన లేదు. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఔటర్ రింగ్ రోడ్డుపై రయ్యిమని వెళ్లే కార్లు.. వేగం తగ్గించాలని పోలీసులు పదే పదే సూచనలు చేస్తున్నారు. అయినా వేగం తగ్గడం లేదు. వేగమే వాహనదారుల ప్రాణాలు బలిగొట్టుందని తాజా ఘటన స్పష్టం చేస్తుంది.
లగ్జరీ కార్లు.. అంతకు మించి స్మూత్ గా ఉండే రోడ్లు. దీంతోనే వాహనదారులు రెచ్చిపోతున్నారు. వేగంగా వాహనం నడిపి ప్రమాదాలకు గురౌతున్నారు. మొన్న నిశిత్, ఇవాళ భరత్ కూడా వేగంగా వాహనం నడిపి ప్రమాదానికి గురయ్యారు. అతివేగంతో వాహనం నడిపి ప్రాణాలు కోల్పోయారు.
అంతవరకు వాహనం ఓ మాదిరి స్పీడ్ తో వెళ్తుంది. ఎందుకంటే సిగ్నల్స్.. దానికి తోడు ట్రాఫిక్. కాని వెహికిల్ ఔటర్ రోడ్డు ఎక్కిందంటే చాలు.. స్టేరింగ్ గాలికి వదిలేస్తారు. కాలు ఎక్సలేటర్ మీద నుంచి తీసే పని ఉండదు. కిందకు తొక్కుతూ ఉంటారే తప్పా.. పైకి లేపే పని ఉండదు. అనుకోకుండా ఏదైనా వచ్చిందంటే అంతే సంగతులు. భరత్ కారు ఆగి ఉన్న లారీని ఢీకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here