తెలంగాణలో కొత్తపార్టీతో పొత్తు పెట్టుకోనున్న పవన్

కార్యకర్తల నియామకంతో ఏపీలో ఊపుమీదున్న జనసేన తెలంగాణలో ఆశించిన స్థాయిలో పార్టీ ప్రాభల్యం లేదనే చెప్పుకోవాలి. అయితే కొద్దిరోజుల క్రితం తెలంగాణలో జనసేన పార్టీ కార్యకర్తల నియామకంలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే  ప్రభుత్వానికి వ్యతిరేకంగా గద్దర్, టీజేఏసీ ఛైర్మన్ పోరాటం చేస్తున్నారు. వీరికి పవన్ జతకలిస్తే బాగుంటుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణలో కొత్త పార్టీతో పొత్తుపెట్టుకొని ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారట.

ఆ కొత్తపార్టీ మాజీ టీఆర్ఎస్ నేత చెర‌కు సుధాక‌ర్ స్థాపించిన తెలంగాణ ఇంటి పార్టీ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీ ఉపాధ్య‌క్షుడిగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే య‌న్నం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. పవన్ – గద్దర్ కు సంబంధాలు బాగున్నాయి. గ‌ద్ద‌ర్ ద్వారా తెలంగాణ ఇంటి పార్టీ + జ‌న‌సేన అక్క‌డ పొత్తు పెట్టుకుని…ఈ కూట‌మికి ప్రొఫెస‌ర్ కోదండ‌రాం క‌లిస్తే టీఆర్ఎస్ జోరుకు బ్రేకులు వేయోచ్చని పొలిటికల్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here