రవితేజ సోదరుడు దుర్మరణం

ఇంకా మంత్రి నారాయణ కొడుకు నిశిత్ చనిపోయిన సంఘటన ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. బయటికి కారణం ఏది చెప్పుకున్నా మితిమీరిన అతి వేగం ఇద్దరు యువకుల నిండు ప్రాణాలు తీసుకుంది అన్నది మాత్రం నగ్న సత్యం. కాని ఇవేవి సమాజానికి పాఠాలు నేర్పవని మరోసారి రుజువయ్యింది. మాస్ మహారాజ సినిమా హీరో రవితేజ తమ్ముడు భరత్ రాజు ఇందాకే కొత్వాల్ గూడ సమీపంలో తన వాహనాన్ని 140 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఆగి ఉన్న డిసిఎం ను గుద్ది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్టు ప్రాధమిక విచారణలో తెలిసినట్టు కథనం. భరత్ రాజు రవితేజ కు తమ్ముడైనా స్వతహాగా నటుడు కూడా. ఎన్నో సినిమాల్లో విలన్ గా, సైడ్ విలన్ గా చాలా పాత్రలు చేసాడు. కాని ఆనుకున స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. దానికి తోడు పలుమార్లు మాదకద్రవ్య రవాణా కేసులో కూడా పలుమార్లు పట్టుబడితే బెయిల్ తీసుకుని ఎలాగోలా బయటే తిరుగుతున్నారు.

భరత్ రాజు అతి వేగం ఈనాటిది కాదు. చాలా సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఉదంతాలు ఉన్నాయి. అయినా కూడా మానుకోకుండా అదే ధోరణిలో వెళ్ళడంతో చివరికి ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇతని వయసు 46. ప్రస్తుతం టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ రెండు సినిమాల షూటింగ్ లో ఒకే సారి పాల్గొంటూ బిజీ గా ఉన్న రవితేజ కు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. తన తమ్ముడికి ప్రవర్తన గురించి పలుమార్లు హెచ్చరించినప్పటికీ భరత్ రాజు పెడచెవిన పెట్టినట్టు తెలుస్తోంది. తన పలుకుబడి ఉపయోగించి వేషాలు ఇప్పిస్తాను కుదురుగా ఉండమని చెప్పినా కూడా భరత్ రాజు వినకపోవడం వల్ల చివరికి ఈ దుస్థితి కలిగింది. ఇకనైనా మద్యం మత్తులో వాహనాలు నడిపితే పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసుకుని ఇంట్లో వాళ్ళ కోసమైనా మార్పు తెచ్చుకుంటే ఎన్నో కుటుంబాల్లో వెలుగులు అలాగే నిలిచిపోతాయి. లేదంటే అంధకారాలే మిగులుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here