కోడిగుడ్ల దొంగ‌త‌నంపై ఖైదీల‌తో ర‌చ్చ చేసిన ఇంద్రాణి ముఖర్జియా

ఇంద్రాణి ముఖ‌ర్జియా జైళ్ల‌లో తిరుగుబాటు చేస్తుంది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య‌కేసులో ఇంద్రాణి నిందితురాలు. క‌న్న‌కూతుర్ని హ‌త్య‌చేయించి ముంబ‌యి బైకుల్లో జైల్లో శిక్ష‌ను అనుభ‌విస్తుంది. ఈ నేప‌థ్యంలో జైల్లో కోడిగుడ్ల‌ను దొంగిలించారంటూ మంజురా షెట్యే అనే ఖైదీని పోలీసులు తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతూ మృతి చెందింది. దీనిపై ఇంద్రాణి నానాహంగామా చేసి వార్త‌ల్లోకి వ‌చ్చింది. మంజురా షెట్యేను ఎందుకుకొట్టారంటూ  200మంది తోటి ఖైదీలతో కలిసి జైలులో ఆందోళనకు, అల్లరికి పాల్పడ్డారు.

ఈ క్రమంలో జైలులోని సామాన్లు ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడికి దిగారు. అంతే వీరు జైలు కోడ‌లెక్కి పేప‌ర్ల‌ను త‌గ‌ల‌బెడుతూ జైలు అధికారుల వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. ఇందులో మొత్తం 251మంది ఖైదీలు ఉండగా వారిలో 200మంది ఆందోళనకు దిగారు. వీరిలో ఇంద్రాణి ముఖర్జియా కూడా ఉండటంతో ఆమెపై కూడా కేసులు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here