దువ్వాడ జగన్నాథమ్‌ (డీజే) సినిమాను నిషేదించాలంటూ పిల్ దాఖ‌లు

అల్లు అర్జున్‌ నటించిన దువ్వాడ జగన్నాథమ్‌ (డీజే) సినిమా నిషేదించాలంటూ  ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఇప్ప‌టికే పాట‌ల్లో బ్రాహ్మ‌ణ సంఘాల్ని కించ‌ప‌రిచేలా ఉందంటూ విమ‌ర్శ‌లు రావ‌డం, వాటిని తొల‌గించి సినిమా ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.  అయినా సినిమాలో బ్ర‌హ్మ‌ణ వేషంలో బ‌న్నీ డైలాగ్స్, పూజా హెగ్దేల మ‌ధ్య స‌న్నివేశాలు ఫ్యామిలీ వ‌ర్గాల్ని అల‌రిస్తుద‌నే టాక్ రావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్ లు జోరందుకున్నాయి.

ఈ నేప‌థ్యంలో సినిమాలో  శృంగార గీతాల్లో యజుర్వేదంలో ఉన్న నమకం, చమకం వంటి పవిత్ర పదాలను ఉపయోగించారని, వీటిని తొలగించేంత వరకు ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన గోగులపాటి కృష్ణమోహన్  దాఖలు చేశారు. ఇప్ప‌టికే ఈ ప‌దాల‌పై సెన్సార్ బోర్డుకు విన్న‌వించుకున్నా ఫ‌లితం లేక‌పోవ‌డంతో కోర్టును ఆశ్ర‌యించిన‌ట్లు తెలిపారు. త‌మ‌డిమాండ్ల‌ను నెర‌వేర్చేవ‌ర‌కు డీజే ప్రదర్శనపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణమోహన్‌ కోర్టును కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here