నా ప్రియుడు స్టీఫెన్ ప‌డ్డాక్ చాలా మంచోడు

అమెరికా లాస్ వెగాస్ లో ‘రూట్ 91 హార్వెస్ట్’ మ్యూజిక్ ఫెస్టివల్‌‌లో జ‌రిగిన మార‌ణ హోమంలో 58మంది ప్రాణాలుకోల్పోయారు. 100మందికి పైగా గాయ‌ప‌డ్డారు.  ఈ న‌ర‌మేదం ఎవ‌రు సృష్టించారు.తీవ్ర‌వాదులు ఎవ‌రైనా ఉన్నారా అనే కోణంలో విచార‌ణ చేప‌ట్టిన అంత‌ర్జాతీయ పోలీసుల‌కు కొన్ని వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. జీవితంలో అన్నీ కోల్పోయిన స్టీఫెన్ ప‌డ్డాక్ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు తెలిసింది.

ఈ కేసు పుర్వాప‌రాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు స్టీఫెన్ కుటుంబ‌స‌భ్యుల్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇందులో భాగంగా విచార‌ణ‌కు హాజరైన స్టీఫెన్ ప్రియురాలు మారిలో డాన్లీ త‌న ప్రియుడు చాలా మంచి వాడ‌ని చెప్పుకొచ్చింది. అంతే కాదు ప్రేమించే గుణం ఉంద‌ని…అందుకే జీవితాంతం అత‌నితో ఉండేందుకు సిద్ధ‌మైన‌ట్లు వెల్ల‌డించింది. త‌న కుటుంబ‌స‌భ్యుల్ని చూసి ర‌మ్మ‌న‌మ‌ని ఫిలిప్సీన్స్  టికెట్లు కొనిచ్చాడ‌ని పేర్కొంది. ఇంత స‌హృద‌యం క‌లిగిన స్టీఫెన్ ఇంత‌మందిని ఎందుకు చంపాడో  అర్ధం కావ‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here