ఐటం సాంగ్స్ తో మెర‌వ‌నున్న పూజా హెగ్దే

పూజా హెగ్దే ఐటం సాంగ్ లో అందాల ఆరబోసేందుకు సిద్ధ‌మైంది. అల్లు అర్జున్ – హెగ్దా కాంబినేష‌న్ లో   ‘దువ్వాడ జగన్నాథం లో న‌టించింది. ఆ సినిమాలో గుడిలో..బ‌డిలో ఎంత‌పాపుల‌ర్ అయ్యిందో అంద‌రికి తెలిసింది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ కంటే పూజాకు ఎక్కువ మార్కులే ప‌డ్డాయి. కానీ అదృష్టం క‌లిసిరాక ఐటం సాంగ్స్ సై అంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

గుడిలో  బ‌డిలో సాంగ్ తో  వ‌రుస ప్రాజెక్ట్ లు వ‌చ్చిప‌డ‌తాయ‌ని అంద‌రు ఊహించుకున్నారు. జీరో సైజ్ న‌డుముతో మిల్కీ బ్యూటీలా క‌నిపించే పూజా ఎంత ట్రై చేసినా టాలీవుడ్ లో, బాలీవుడ్ లో అవ‌కాశాలు దొర‌క‌డం క‌ష్ట‌మైంది. అందుకే రాంచరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాలో ప్రత్యేక ఐటం సాంగ్‌కు పూజా హెగ్డే నర్తించనుంది.

ఈ సినిమాలో ఐటంసాంగ్ కోసం హీరోయిన్ ల కోసం వెదికే ప‌నిలో ఉండ‌గా సుకుమార్ పూజాని ఫ్రిఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని ఆమెకు ఫోన్ చేసి చెప్పిన‌ట్లు ..పూజా  ఐటం సాంగ్ చేస్తాన‌ని చెప్పిన‌టట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here