మీకు ఒళ్లు కొవ్వెక్కింది..వెబ్ సైట్ల నిర్వ‌హాకుల‌పై న‌టి హేమ ఫైర్

వెబ్ సైట్ల నిర్వ‌హాకుల‌పై సినీ వ‌ర్గాల నుంచి హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. సినీ ఇండ‌స్ట్రీ  న‌టీన‌టుల‌పై గాసిప్స్ రావ‌డంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మా ఫిర్యాదు మేర‌కు అప్ర‌మ‌త్త‌మైన పోలీసు యంత్రాంగం వెబ్ సైట్ నిర్వాహ‌కుల్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధ‌మైంది.

ఈ నేప‌థ్యంలో న‌టి హేమ ఓ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో  వెబ్ సైట్ల‌లో వ‌చ్చే గాసిప్స్ గురించి మండిప‌డింది. సినిమా వాళ్ల‌నే కాకుండా సామాన్యుల్ని సైతం టార్గెట్ చేస్తూ వెబ్ సైట్ల‌లో మ‌హిళ‌ల గురించి అస‌భ్యంగా వార్త‌లు రాస్తున్నార‌ని…ఇలా ఒళ్లు కొవ్వెక్కి రాయ‌డం వ‌ల్ల కొంత‌మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని పేర్కొంది.

అంతేకాదు త‌మ‌పెళ్లాం పిల్ల‌ల పోష‌ణ నిమిత్తం వెబ్ సైట్ల‌లో బూతులు రాసి సొమ్ము చేసుకుంటున్నార‌ని .. చదువుకి సంబంధించిన వాటిని గూగుల్‌లో సెర్చ్ చేస్తే దాని ప‌క్కన ఇది క్లిక్ చేయండంటూ అశ్లీల వీడియోలు, రాత‌లు ఉంటున్నాయ‌ని హేమ చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here