యువ‌హీరోతో డేటింగ్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ మ‌ర‌ద‌లు

చేసింది ఒక్క‌సినిమా అయినా ఆ హీరోయిన్ పై రోజుకో రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం ఆ హీరోయిన్ న్యాచుర‌ల్ స్టార్ నానీతో గొడ‌వ‌పెట్టుకుంద‌ని…దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ చిత్రం లో ఆ హీరోయిన్, నాని హీరో గా చేస్తున్నారు. అయితే డైలాగ్  విష‌యంలో నాని కి ఆమె ప‌ద్ద‌తి న‌చ్చ‌లేద‌ని స‌రిచేసుకోవాల‌ని సూచించాడ‌ట‌.

అంతే నువ్వు నాకే చెప్పేదేంటి..నువ్వునాకు చెప్పాల్సిన అవ‌స‌రంలేదంటూ షూటింగ్ స్పాట్ నుంచి భ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై దిల్ రాజు ఆ హీరోయిన్ ను నాని పిలిపించి వివాదం స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఇంత‌కీ ఆ హీరోయిన్  ఎవ‌రంటే తెలుగులో త‌న మొట్ట‌మొద‌టి సినిమా ఫిదాలో వ‌రుణ్ తేజ్ మ‌ర‌ద‌లిగా ఎంట్రి ఇచ్చి తెలుగు అభిమానుల‌కు ద‌గ్గ‌రైన ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌వి.

ఇప్పుడు సాయిప‌ల్ల‌వి గురించి మ‌రో వార్త నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే సాయిప‌ల్ల‌వి “ఓకే బంగారం”తో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ తో డేటింగ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు గుప్పుమంటున్నాయి. ప్ర‌స్తుతానికి ఆ యువ‌హీరోకి జోడిగా  ‘ఓయ్ పిల్లగాడా’ అనే సినిమాలో  నటిస్తోంది. సినిమా ఘూటింగ్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు వీరిద్ద‌రు గ‌త కొద్దికాలంగా డేటింగ్ లో ఉన్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here