క‌న్నీటితో క‌రెంట్ త‌యారీ

కరెంట్ ను త‌యారు చేసేందుకు నీటిని, గ‌డ్డిని, వ్య‌ర్ధ‌పదార్ధ‌ల‌ను ఉప‌యోగిస్తాం. వీటితో పాటు గుడ్డు తెల్ల‌సొన‌, క‌న్నీరును కూడా క‌రెంట్ ను త‌యారు చేసేందుకు ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  మ‌న‌కు ఇది న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోయినా..సైంటిస్ట్ లు బ‌ల్ల‌గుద్ది మ‌రి చెబుతున్నారు క‌న్నీటితో క‌రెంట్ ను త‌యారు చేసుకోవ‌చ్చ‌ని.

వీటిలో ఉండే పిజో ఎల‌క్ట్రిసిటీ లైసోజోముగా పిల‌వ‌డ‌బ‌డే ప్రొటీన్ల ద్వారా క‌రెంట్ ఉత్ప‌త్తి జ‌రుగుతుంద‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ లిమెరిక్ సైంటిస్ట్ లు తెలిపారు. అంతేకాదు క‌న్నీరు..పై ప్రొటీన్లు క‌లిసిన‌ప్పుడు వ‌చ్చే పీడ‌నంతో ఎల‌క్ట్రో యాక్టివ్  మ‌రియు వైద్య‌ప‌రిక‌రాల్లో సూక్ష్మ‌జీవుల్ని న‌శింప‌జేసే పూత‌గా వాడుకొవ‌చ్చ‌ని సూచిస్తున్నారు.  దీని సాయంతో భవిష్యత్తులో శరీరంలో మందుల విడుదలను నియంత్రించే ఆవిష్కరణలు సులభతరం అవుతాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here