అత్యంత భారీ కొండ‌చిలువ‌ను కూరొండుకొని తిన్నారు.

సాధార‌ణంగా కొండ చిలువను చూస్తే మ‌న‌కి ఏమ‌నిపిస్తుంది. దూరంగా పారిపోవ‌డ‌మో, పైప్రాణాలు పైకిపోవ‌డమో జ‌రుగుతాయి. ఎందుకంటే కొండ చిలువ త‌మ‌ని చుట్టేసి తినేస్తుందనే భ‌యంతో. కానీ వీళ్లు మాత్రం అత్యంత భారీ పొడ‌వైన కొండ‌చిలువ‌ను కొట్టిచంపేసి కూరొండుకొని తిన్నారు.

ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లోని పెక‌రన్ బారు అనే గ్రామానికి చెందిన  రాబ‌ర్ట్ న‌బ‌న‌న్ పామాయిల్ పొలంలో సెక్యూరిటీ గార్డ్ గా ప‌నిచేస్తున్నారు. ఆ స‌మ‌యంలో  7.8మీట‌ర్ల పొడ‌వున్న కొండ‌చిలువ రాబ‌ర్ట్ పై  దాడికి దిగింది. దానిని నిలువ‌రించేందు దాడికి దిగాడు. ఈ దాడిలో కొండ‌చిలువ రాబ‌ర్ట్ ఎడ‌మ‌చేయిని తినేసింది.

ప్రాణ‌భ‌యంతో బాధితుడు కేక‌లు వేయ‌డంతో ఆ ఊరికి చెందిన గ్రామస్థులు, మ‌రో ఇద్ద‌రు గార్డులు ఏక‌మై ఆ కొండ‌చిలువ‌ను కొట్టిచంపారు. అనంత‌రం దానిని చెట్టుకు క‌ట్టేసి..ముక్క‌లు కోసం కూర చేసుకొని ఆవురావుమంటూ తిన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here