బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి విషమం

టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బ్రహ్మానందం..! టాలీవుడు దిగ్గజ హాస్యనటుడు. 1000పైగా సినిమాలు. తాను  పెట్టించే కితకితల  కామెడీతో తెలుగు సినిమా ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు. ఇండస్ట్రీకీ రోజుకో కమెడియన్ ఎంటర్ అవుతున్నా..తన కామెడీ టైమింగ్ తో సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్విస్తూ టాలీవుడ్ ను శాసిస్తున్నాడు.

అలాంటి నవ్వుల రారాజు గురించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కాస్త ద్రిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. గతంలో బ్రహ్మానందానికి ఆఫర్లు రావడంలేదని, అందువల్లే సినిమాలు చేయడం తగ్గిస్తున్నాడని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని..చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రిలో చేరాడని వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన కొన్ని వీడియోలో నెట్టింట్లో అలజడి సృష్టిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

గత కొన్ని సంవత్సరాలుగా  టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాఠాన్మరణం చెందడంతో అభిమానులు భయాందోళనలో గురవుతున్నారు. ఏది ఏమైనా బ్రహ్మానందం ఆరోగ్య గురించి ఆయన కానీ, ఆయన కుటుంబసభ్యులు ఎటువంటి బహిరంగ ప్రఖటన చేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here